నా పేరు డింగు! నా పేరు వెనుక చిన్న ఫ్లాష్‌బ్యాక్.
అవి నేను ఇంటర్ చదివే రోజులు. అలా అని మరీ 90ల్లోకి వెళ్ళకండి. 2005లో నాలో రచయిత సూపర్‌మాన్‌లా బయటకి వచ్చాడు. నాకు కథ రాయాలనిపించింది. వెంటనే ఓ పది లైన్లు రాసి కథ మొదలుపెట్టాను. మిగిలింది తరువాత రాద్దామని బుక్కు పక్కన పెట్టెసాను. అదే నేను చెసిన చారిత్రక తప్పిదం. అప్పటికి శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లో అక్కల రూపంలో ఉంటారనే విషయం నాకింకా తెలియలేదు. తరువాత రోజు నేను మిగిలిన కథ రాస్తుండగా అక్క వచ్చింది.
"ఏంట్రా! కథ రాస్తున్నావా?"(నవ్వు)
"కథా? నేనా?"( కొంపతీసి చదివిందా!?)
తరువాత నవ్వుతూ నా కథలో సీను చెప్పింది. అందరికి చెప్తానని బెదిరించింది(నా స్క్రిప్ట్ కొంచెం వెరైటీలెండీ). కొన్ని రోజులు నేనేం రాస్తున్నా ఏంట్రా కథ రాస్తున్నావా అనేది.
అలా ఈ శతాబ్ది రచయిత(నేనే) ఏకైక కథ రాయకుండానే అటకెక్కింది. ఈ సమాజంలో రచయితలన్న, తాగుబోతులన్న చిన్నచూపు వాళ్ళదో లోకం అనుకుంటారు.
అందుకే నా పేరు డింగు అని పెట్టుకున్నాను, నా రచనలు చదివి నా వెంటపడి(అభిమానంతో) నన్ను బాధపెట్టకుండా..........
mee blog bale undi hehe
ReplyDeleteenti maa budugu gaadi foto vesaru
ReplyDeleteAtaka digimda inthaki?
ReplyDeleteInka ledu..
Delete